Sunday, 13 September 2026 07:02:15 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ధూపదీప నైవేద్య అర్చకులను కించపరచడం సారి కాదు.

మాదిరాజు మధు శర్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆగ్రహం

Date : 08 July 2026 09:53 PM Views : 356

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : వరంగల్ వేయి స్తంభాల గుడి ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, ధూపదీప నైవేద్య అర్చకులను ఉద్దేశించి చేసిన అవమానకర వ్యాఖ్యలను రాష్ట్ర అర్చక సంఘం ఉపాధ్యక్షులు తీవ్రంగా ఖండించారు.ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన ఒక పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపేంద్ర శర్మ.చిన్న గుడులలో ధూప, దీప, నైవేద్యాలు సమర్పించే అర్చకులను కించపరిచేలా మాట్లాడటం దురదృష్టకరం అని ఆయన మండిపడ్డారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఏ దేవాలయంలోనైనా ఆరాధన క్రమం ఒకటే ఉంటుందని, భగవంతుడికి సేవ చేసే అర్చకులలో చిన్న, పెద్ద అనే తారతమ్యాలు తీసుకురావడం సరికాదని హితవు పలికారు. ​రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 6,575 మంది ధూపదీప నైవేద్య అర్చకుల మనోభావాలను దెబ్బతీసిన ఉపేంద్ర శర్మ, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ పిలుపు మేరకు.. ఒకవేళ ఉపేంద్ర శర్మ క్షమాపణలు చెప్పని పక్షంలో, జిల్లాలోని అర్చకులందరినీ సంఘటితం చేసి వేయి స్తంభాల గుడి వద్ద నల్ల బ్యాడ్జీలతో భారీ నిరసన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర ఉపాధ్యక్షులు హెచ్చరించారు

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :