Friday, 11 September 2026 02:46:44 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం

Date : 11 September 2026 01:48 PM Views : 30

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : స్థానిక మందమర్రి హరిహర దేవస్థాన ప్రాంగణంలో సంతోషి మాత వ్రత ఉద్వాసన మహోత్సవం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగింది. గత కొన్ని వారాలుగా నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరించిన మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి పంచా మృతాభిషేకం నిర్వహించి, విశేష పుష్పాలంకరణ చేశారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణల నడుమ లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చనలు, మహా పూర్ణాహుతి హోమం శాస్త్రోక్తంగా సాగాయి. ఉద్వాసన క్రతువులో భాగంగా వ్రతమాచరించిన భక్తులు అమ్మవారి కథా శ్రవణం చేసి, కన్యకా పూజలు నిర్వహించి చిన్నారులకు దక్షిణ తాంబూలాలు అందజేశారు.పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, కాలనీ పెద్దలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :