Saturday, 12 September 2026 04:52:00 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

దళితులపై పెత్తందారుల దౌర్జన్యం బుట్టరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్

Date : 02 May 2026 04:59 PM Views : 157

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామంలో దళితులపై జరుగుతున్న పెత్తందారుల దౌర్జన్యాలను అరికట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. శనివారం రొయ్యలపల్లి గ్రామంలో బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.గ్రామానికి చెందిన రావుల సుజాత, జీవన్ దంపతులు తాము కొనుగోలు చేసిన భూమిలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం పిల్లర్లు వేస్తుండగా, అదే గ్రామానికి చెందిన గోడిసెల బుట్టరెడ్డి, అతని భార్య సమ్మక్క కలిసి ఆ పిల్లర్ రాడ్లను కూల్చివేశారు. ఈ క్రమంలో బాధితులను కులం పేరుతో దూషిస్తూ అరాచకానికి పాల్పడ్డారని రవి ఆరోపించారు. రాజకీయ కక్షల నేపథ్యంలో దళితులను లక్ష్యంగా చేసుకుని బుట్టరెడ్డి దౌర్జన్యం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ పెత్తందారులకు ఊడిగం చేస్తున్న కోటపల్లి ఎంపిడిఓ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించకపోవడం వల్లే పెత్తందారులకు బలం చేకూరుతోందని విమర్శించారు.లేని పక్షంలో కార్మిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని సంకె రవి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం, ఆత్రం సంపత్, దుర్గం గంగారాం, దుర్గ మహేష్, బాధితులు రావుల సుజాత, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :