వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : మొబైల్ భద్రత, సైబర్ నేరాలు, సెల్ టవర్ రేడియేషన్‌పై గోలేటిలోని జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బెల్లంపల్లి ఏరియా జీఎం ఎం.శ్రీరమేష్ ముఖ్య అతిథిగా,హాజరయ్యారు ఇండియన్ టెలికాం సర్వీస్ అధికారులు ఎన్. సత్యనారాయణ, డి. భాస్కరరావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ‘సంచార్ సాథీ’ యాప్ వినియోగం, ప్రయోజనాలను వివరించారు. సిమ్ కార్డులను ఇతరులకు ఇవ్వొద్దని, మొబైల్ ఫోన్ పోయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. సెల్ టవర్ల రేడియేషన్ ప్రభావంపై కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (ఐఈ) ఉజ్వల్ కుమార్ బెహార, డీజీఎం పర్సనల్ డి. కిరణ్‌బాబు, ఎస్వో టు జీఎం స్వామిరాజు, ఫైనాన్స్ మేనేజర్ మామిడి రవికుమార్, వీటీసీ మేనేజర్ మధుసూదన్, ఐటీ హెచ్‌వోడీ ముజీబ్‌తో పాటు వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం