వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 74 మంది లబ్ధిదారు లకు కల్యాణ లక్ష్మి పథకం చెక్కులను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి బుధవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. కల్యాణ లక్ష్మి పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మారుసుకోలా సరస్వతి, కెరమెరి మండల ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం