Sunday, 13 September 2026 07:40:11 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

పాఠశాలల బస్ డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు

Date : 06 July 2026 05:00 PM Views : 106

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లపై సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.తనిఖీల సందర్భంగా బస్సుల డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, బీమా తదితర పత్రాలను పరిశీలించారు. విద్యార్థుల ప్రాణాలతో ముడిపడి ఉన్న బాధ్యతను ప్రతి డ్రైవర్ గుర్తుంచుకొని అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ, పాఠశాల బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించరాదని, అన్ని ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు.విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ప్రతి డ్రైవర్ బాధ్యత అని పేర్కొంటూ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. పాఠశాల యాజమాన్యాలు కూడా బస్సుల భద్రతా ప్రమాణాలు, డ్రైవర్ల అర్హతలు, వాహనాల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :