వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకాలం తెరచాటు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన మంతెన జగన్ మోహన్‌రావు తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం ఆసక్తి రేపుతోంది. ఇప్పటివరకు ఎమ్మెల్యే పీఎస్ఆర్‌కు షాడోగా ఉన్న జగన్.. తాజాగా మంత్రి వివేక్ వెంకటస్వామి అనుచరుడిగా కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కాకా వెంకటస్వామి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించడం ద్వారా తన రాజకీయ వైఖరిపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Reporter
వాస్తవ గమ్యం