వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : క్రీడా పోటీల ద్వారా వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల మధ్య స్నేహభావం పెంపొందుతుందని బెల్లంపల్లి ఏరియా ఎస్‌ఓటు జీఎం కె. రాజమల్లు అన్నారు. డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ 93వ వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా శుక్రవారం గోలేటిలోని శ్రీ భీమన్న మైదానంలో ఎస్‌ఓటు జీఎం జట్టు, ఖైరిగూడ ప్రాజెక్ట్ అధికారి జట్ల మధ్య జరిగిన డిపార్ట్‌మెంటల్ హాకీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కె. రాజమల్లు మాట్లాడుతూ ఉద్యోగ క్రీడాకారులు సమిష్టిగా పోటీల్లో పాల్గొని కోల్ ఇండియా స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడల సాధనతో ఒత్తిడి తగ్గడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. గతంలో పతకాలు సాధించిన సీనియర్ క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ అధికారి మండల శ్రీనివాస్, జనరల్ కెప్టెన్ ఎస్.కె. అబ్బాస్, ఏఐటీయూసీ నాయకుడు మారం శ్రీనివాస్, క్రీడాకారులు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం