Saturday, 12 September 2026 09:01:49 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో సెల్ టవర్ నిర్మాణం ఆపాలి

​విద్యార్థుల ఆరోగ్యంపై రేడియేషన్ ప్రభావం పడే అవకాశం ​- 35 ఏళ్ల నాటి చెట్ల నరికివేతపై పర్యావరణ ప్రేమికుల ఆగ్రహం ​- అధికారులకు విన్నవించిన కోలుగురి విజ

Date : 09 April 2026 02:00 PM Views : 361

వాస్తవ గమ్యం / తెలంగాణ / : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో ఎయిర్‌టెల్ సెల్ టవర్ నిర్మాణాన్ని చేపట్టడంపై స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు సామాజిక సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం నాడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంచిర్యాల జిల్లా కన్వీనర్ కోలుగురి విజయ్ కుమార్ ఈ విషయంపై అధికారులకు విన్నవించారు. పాఠశాల ఆవరణకు అతి సమీపంలో టవర్ నిర్మించడం వల్ల వెలువడే రేడియేషన్ విద్యార్థులపై, ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ​టవర్ నిర్మాణం కోసం సుమారు 35 ఏళ్ల చరిత్ర గల వృక్షాలను ఇప్పటికే నరికివేయడం అత్యంత బాధాకరమని, అత్యంత కాలుష్య భరితమైన మందమర్రిలో ఇలాంటి చర్యలు ప్రజల ఆరోగ్యానికి గొడ్డలి పెట్టు అని పేర్కొన్నారు. ​నిత్యం వందలాది మంది వాకర్స్, క్రీడాకారులు వినియోగించుకునే ఈ మైదానంలో టవర్ నిర్మించడం సరికాదని, ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. ఈ సమస్యపై రాష్ట్ర మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ మరియు సింగరేణి ఏరియా జిఎం రాధాకృష్ణ వెంటనే స్పందించి నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు. జనావాసాలు లేని ప్రాంతానికి ఈ టవర్‌ను తరలించి, పాఠశాల విద్యార్థులను, పర్యావరణాన్ని కాపాడాలని రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సంఘాల మిత్రులు మరియు తల్లిదండ్రులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :