వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : బెల్లంపల్లి ఏరియాలోని ఖైరగుడా ఓపెన్‌కాస్ట్ గనిలో కార్మికుల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో శనివారం ఖైరగుడా గని ఎస్‌ఓఎం అధికారికి వినతిపత్రం అందజేశారు. బెల్లంపల్లి ఐ ఎన్ టి యు సి యూనియన్ ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ప్రస్తుతం అమలులో ఉన్న ప్లేడే విధానాన్ని గతంలో మాదిరిగా కార్మికులకు 7౦ శాతం ప్లేడేలు కల్పించాలని నాయకులు కోరారు. అలాగే ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఉద్యోగులకు ప్రతి సంవత్సరం నిర్వహించనున్న పీఎంఈ విధానాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల అవసరాలు, నిబంధనలకు అనుగుణంగా గతంలో అమలులో ఉన్న విధంగా మూడు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి పీఎంఈ నిర్వహించే విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సీపీఎంఎఫ్ చిట్టీలను కార్మికులకు వెంటనే అందజేయాలని వినతిపత్రంలో కోరారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ విషయంలో యాజమాన్యం సానుకూలంగా స్పందించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఐ ఎన్ టి యు సి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ ప్రకాష్ రావు,ఏరియా కార్యదర్శులు మాధవ్ కృష్ణ, బూర శ్రీనివాస్, అసిస్టెంట్ పీఐటీ కార్యదర్శి గోమాస ప్రభాకర్‌తో పాటు వీరాస్వామి, వెంకటేష్ ఎం.పీ., వామన్, కుమారస్వామి, శివకుమార్, తిరుపతి, రాజశేఖర్, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం