వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో.దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.వేద పండితుల మంత్రోచ్ఛా రణలు,మంగళవాయిద్యాల నడుమ హోమ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. చండీ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. దుర్గామాత నామస్మరణతో మండపం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.
Reporter
వాస్తవ గమ్యం