Saturday, 12 September 2026 05:38:23 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పోరాటం కొనసాగుతుంది

బట్టారి వెంకటేశ్వర్లు

Date : 11 July 2026 07:18 PM Views : 64

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రాష్ట్రోపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా ప్రత్యేక కార్యవర్గ సమావేశం శనివారం జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పర్వతి రెడ్డి, జాక్టో కో-చైర్మన్ పర్వతి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ మాట్లాడుతూ, జూలై 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే త్వరలోనే పీఆర్సీ నివేదికను స్వీకరించి అమలు చేస్తారని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వీలైనంత త్వరగా పూర్తిగా చెల్లిస్తారని రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ మాట్లాడుతూ, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు రాష్ట్రోపాధ్యాయ సంఘం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు వెంటనే చేపట్టాలని, ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను ప్రభుత్వం. విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనలకు సిద్ధమవుతారని హెచ్చరించారు.సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓడిగే కృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు వనమాల పద్మ, రాష్ట్ర కౌన్సిలర్ వి. కరుణాకర్, ఉపాధ్యక్షుడు చీపెళ్లి బాపు, మహిళా కార్యదర్శులు మహాలక్ష్మి, స్వప్న, మన్మోహన్, రాజ్‌కుమార్, సుమన్, విశ్వనాథ్, జయ, గంగుతాయి తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :