Saturday, 12 September 2026 05:51:39 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఏఐటీయూసీ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్*

Date : 05 July 2026 04:08 PM Views : 90

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఏఐటియుసి జిల్లా నాలుగో మహాసభలు ఈనెల 26వ తేదీన ఆసిఫాబాద్ మైనార్టీ ఫంక్షన్ హాల్లో జరుగుతాయని,జిల్లాలోని కార్మికులు,కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చాడు.ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిపో కమిటీ సమావేశం యూనియన్ ఉపాధ్యక్షులు జాడి లక్ష్మణ్ అధ్యక్షతన ఆసిఫాబాద్లోని ఎస్టియు భవన్లో జరిగింది ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేసి, అపాయింట్మెంట్ డేట్ ను ప్రకటించి,ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు,గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని, ఆర్టీసీ కార్మికులపై అధికారుల వేధింపులు వెంటనే ఆపాలని,రోజురోజుకీ ఆర్టీసీ కార్మికులపై అధికారుల వేధింపులు ఎక్కువ అవుతున్నాయని అధికారులు వేధింపులు ఆపాకుంటే TGSRTC ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. CCS ఎన్నికలు నిర్వహించాలని,బ్రీత్ ఎనలైజర్ మిషన్ తో కార్మికులను ఇబ్బందులకు గురి చేయొద్దని,ప్యాసింజర్స్ గ్రీటింగ్స్ తో కార్మికుల మనోభావాలను దెబ్బతీయొద్దని అన్నారు.ఆర్టీసీ కార్మికులకు కనీస పెన్షన్ 25000/-చెల్లించాలని,DDల పేరుతో యాజమాన్యం కార్మికులను శ్రమదోపిడి గురి చేస్తుందని,లీవులు కూడా ఇవ్వడం లేదని ఆ పద్ధతి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో *ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు,ఎంప్లాయిస్ యూనియన్ సలహాదారుడు దివాకర్ గౌడ్,చైర్మన్ మల్లికార్జున్, డిపో సెక్రటరీ ఏల్పుల అశోక్ సహాయ కార్యదర్శి నరేష్,సునీల్,సుప్రీత్, S.తిరుపతి, రాజలింగ్, వెంకటేశు* తోపాటూ తదితరులు పాల్గొన్నారు

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :