వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి నేషనల్ హైవేపై భద్రతా నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారు.హైవే దగ్గరలో కనీసం ఎటువంటి సేఫ్టీ బోర్డులు గానీ,ప్రమాద హెచ్చరిక బోర్డులు (Caution Boards) గానీ ఏర్పాటు చేయకుండానే రోడ్డు మధ్యలోనే పనులు చేయిస్తుం డటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.వేగంగా దూసుకొచ్చే వాహనాల మధ్య సూచికలు లేకుండా పనులు చేపట్టడం వల్ల ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని వాహనదారులు తీవ్ర భయాం దోళన చెందుతున్నారు.ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఏదైనా ఘోర ప్రమాదం జరిగి ప్రాణనష్టం వాటిల్లితే బాధ్యత ఎవరిది? పనులు చేయిస్తున్న కాంట్రాక్టరా, ఎన్పీఎస్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (NPS Systems Pvt Ltd) సంస్థా లేక అదానీ గ్రూపా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.ఈ తీవ్ర భద్రతా లోపాలపై సైట్ మేనేజర్‌ను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
Admin
వాస్తవ గమ్యం