Wednesday, 28 October 2026 11:44:31 PM
# ఆర్టీఐ చట్టంపై ప్రజలకు అవగాహన అవసరం: యుఎఫ్ ఆర్టీఐ # అంగన్‌వాడీ టీచర్‌, హెల్పర్‌ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన # మణికంఠుని పల్లకి సేవలో పాల్గొన్న అజ్మీర శ్యామ్ నాయక్ # ఎంఏ రఫీక్‌ను ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు # రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి

ఇంటర్ ఫలితాల్లో మందమర్రి మెరుపు..

రాష్ట్ర స్థాయిలో గంగిపెల్లి సిరి అద్భుత ప్రతిభ!

Date : 12 April 2026 02:23 PM Views : 680

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కృషి, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది మందమర్రి బిడ్డ గంగిపెల్లి సిరి. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈమె అసాధారణ ప్రతిభను కనబరచి, మందమర్రి పట్టణ ఖ్యాతిని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లింది.​మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం శాంతినగర్‌కు చెందిన రాజేశం–పద్మ దంపతుల కుమార్తె సిరి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది. మొత్తం 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి, 'ఏ ' గ్రేడ్‌తో ఉత్తీర్ణత పొందింది.కేవలం రెండు మార్కులు మాత్రమే కోల్పోయి, రాష్ట్ర స్థాయి టాపర్ల సరసన నిలిచింది.ప్రస్తుతం హైదరాబాద్‌లో విద్యనభ్యసిస్తున్న సిరి, చిన్ననాటి నుంచే చదువులో ముందుండేది. నిరంతర శ్రమ, క్రమశిక్షణే తన విజయ రహస్యమని ఆమె నిరూపించింది. ఈ సందర్భంగా స్థానికులు, విద్యావేత్తలు సిరిని అభినందిస్తూ.. ఆమె విజయం మరెంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ​పట్టుదలతో చదివితే లక్ష్యాలు తప్పకుండా సాధ్యమవుతాయని సిరి నిరూపించిందని, భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పట్టణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :