వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీనియర్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, జాతీయ యాదవ సంఘం నాయకులు బండి సదానంద యాదవ్‌ను మందమర్రి పట్టణ సంక్షేమ సంఘం సభ్యులు, ప్రెస్ క్లబ్ సభ్యులు బుధవారం ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ప్రమాదంలో గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ధైర్యంగా ఉండాలని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా జీవితంలోకి తిరిగి రావాలని కోరారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం