Saturday, 12 September 2026 04:35:17 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహణ

గజెల్లి వెంకటయ్య

Date : 07 August 2026 04:45 PM Views : 80

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోలాపూర్, భివండి ప్రాంతాల్లో చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన నేత కళాకారులను పూల బొకేలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి జీవితాంతం ఉద్యమం చేశారని, తెలంగాణ కోసం సిరిపురపు యాదయ్యతో పాటు అనేక మంది నేత కార్మికులు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు గడిచినా చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగలేదని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆయన విమర్శించారు.చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే, రాష్ట్రంలో సుమారు 15 శాతం జనాభా కలిగిన పద్మశాలీయులు రాజకీయాలకు అతీతంగా ఐక్యమై రాజ్యాధికారంలో వాటా సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్, అసెంబ్లీ, మంత్రివర్గం, కార్పొరేషన్లలో తమకు తగిన ప్రాతినిధ్యం దక్కించుకునేందుకు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నీ సామాజిక న్యాయం కోసం ఐక్యంగా ముందుకు రావాలని, రాబోయే ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని వెంకటయ్య కోరారు.ఈ సందర్భంగా పద్మశాలి, బీసీ, తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో గజెల్లి వెంకటయ్యతో పాటు పద్మశాలి సంఘం నాయకులు సీహెచ్ మొగిలి, ఏ. సాగర్, కె. కృష్ణమూర్తి, రాజలింగు, మల్లయ్య, రాజమౌళి, లచ్చయ్య, నారాయణ, చిందం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: