Sunday, 13 September 2026 07:32:21 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బిల్‌ కలెక్టర్, బీట్‌ ఆఫీసర్‌

Date : 01 May 2026 06:06 PM Views : 110

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణలో వేర్వేరు ఘటనల్లో అవినీతికి పాల్పడుతూ ఒక మున్సిపల్ బిల్ కలెక్టర్, ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ​ఒకరు సదాశివపేట ఆస్తి పన్ను తగ్గింపు కోసం.సదాశివపేట మున్సిపాలిటీలో బిల్‌ కలెక్టర్‌ నిఖిల్‌రెడ్డి ఒక ఇంటి యజమాని నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.బాధితుడికి రావాల్సిన రూ. 1.04 లక్షల ఇంటి పన్నును రూ. 35 వేలకు తగ్గిస్తానని నమ్మించి, అందుకు రూ. 35 వేలు డిమాండ్ చేశాడు. ఇప్పటికే రూ. 20 వేలు తీసుకున్న నిఖిల్‌రెడ్డి, గురువారం మిగిలిన రూ. 15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ​రెండోది భద్రాద్రి జిల్లా పోడు భూమి విషయంలో.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ బానోత్ నరేశ్‌ ఏసీబీకి చిక్కాడు. ఒక రైతు సాగు చేసుకుంటున్న పోడు భూమి జోలికి రాకుండా ఉండేందుకు నరేశ్ రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు, లంచం తీసుకుంటున్న సమయంలో నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ​ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :