Friday, 11 September 2026 01:47:04 PM
# జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు # మందమర్రి లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

శ్రీరాంపూర్ బిర్యానీ సెంటర్ లో ఘర్షణ పై వాస్తవాలు

Date : 30 August 2026 01:31 PM Views : 346

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని శివాజీ బిర్యానీ సెంటర్ లో శనివారం రాత్రి పెరుగు విషయంలో కొంతమంది వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగిన విషయం పోలీసుల దృష్టికి వచ్చింది.ఘటనలో భాగం గా నిందితులు అయిన పొన్నాల ప్రశాంత్,పొన్నాల కిషోర్ అనే వ్యక్తులు బిర్యానీ సెంటర్‌లో ఉన్న ఫిర్యాదు దారుడు అయిన మనుబోతుల ప్రశాంత్ అనే వ్యక్తిని హోటల్ యజమాని అనుకొని పెరుగు అడగగా,ఇరువురి మధ్య వాగ్వాదం. జరిగింది.అనంతరం నిందితులు ఫిర్యాదుదారుడిపై చేతులతో,వాటర్ బాటిళ్లతో దాడి చేసినట్లు విచారణలో తేలినది.ప్రశాంత్ ఫిర్యాదు మేరకు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి,ఫిర్యాదులో పేర్కొన్న నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియా/వార్తా కథనాల్లో బీర్ బాటిల్స్ తో దాడి చేసినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ,అది వాస్తవం కాదు.దర్యాప్తులో లభించిన సమాచారం ప్రకారం, ఫిర్యాదుదారుడిపై ప్లాస్టిక్ తమ్సప్ బాటిళ్లు,చేతులతోనే దాడి జరిగినట్లు నిర్ధారణ అయింది.ఈ ఘటనలో ఎవరికి గాయాలు అవలేదు,ఆసుపత్రి కి చికిత్స నిమిత్తం వెళ్ళలేదు.అదేవిధంగా నిందితుల గత నేరచరిత్రను పరిశీలించి,చట్టపరమైన నిబంధనల ప్రకారం రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగిందని పోలీసులు.తెలియజేశారు. శ్రీరాంపూర్ పోలీస్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబడవని, ప్రజలు వాస్తవాలను నిర్ధారించుకోకుండా తప్పుడు సమాచారం లేదా అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేయవద్దని పోలీసులు పేర్కొన్నారు.

GAJULA SADANANDAM

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: