వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, సిర్పూర్ (యు) మండలం, పంగిడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ ఆత్రం మీరా జలింశావ్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని షాపుల రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు వర్షాకాలంలో పారిశుధ్య నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్లలో నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి, నీటి కుండలను తరచూ శుభ్రం చేయాలి. గ్రామ పరిధిలోని మురికి కాలువలలో చెత్తాచెదారం వేయకుండా పారిశుధ్యాన్ని కాపాడాలి.వర్షాకాలంలో మంచినీటిని బాగా కాచి, చల్లార్చిన తర్వాతే తాగాలి. గ్రామంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి షారుక్, ఉప సర్పంచ్ ఆత్రం మక్తూర్ సావ్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం