వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలం వట్టివాగు గ్రామంలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్‌సీఆర్‌పీ రాథోడ్ రవీందర్, ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. బడిఈడు, బడి బయట పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు వివరించారు. ప్రతి విద్యార్థి పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Admin
వాస్తవ గమ్యం