వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, రాజంపేట: గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాజంపేట గ్రామపంచాయతీ పరిధిలోని యూనియన్ బ్యాంక్ వెనుక గల్లీలో సర్పంచ్ బుర్స పోచయ్య ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా బతుకమ్మ మరియు శారదాదేవి షెడ్డు పరిసరాల్లో పేరుకు పోయిన చెత్తను తొలగించి, పరిసరాలను శుభ్రం చేయించారు. గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు గ్రామ పంచా యతీ సిబ్బంది ప్రత్యేకంగా శ్రమించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుర్స పోచయ్య , వార్డు సభ్యురాలు బొట్టుపెల్లి లావణ్య, గ్రామ మహిళలు, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొని పరిశుభ్రత పనులను చేపట్టారు.గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ గ్రామాభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా సూచించారు. పరిశుభ్రమైన గ్రామమే ఆరోగ్యకరమైన గ్రామమని పేర్కొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం