వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బీఎల్ఓలు ప్రతి గ్రామపంచాయతీలో తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి సూచించారు. చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు మందమర్రి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కడారి జీవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఎల్ఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్ఓలకు గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పూర్తి సహకారం అందించాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ మండల కమిటీ సభ్యులు, సర్పంచులు, పార్టీ నాయకులు, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం