Sunday, 13 September 2026 10:53:44 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

పని ఒత్తిడితో ఆశా వర్కర్ మృతి..

కుటుంబానికి పరిహారం డిమాండ్

Date : 09 May 2026 06:04 PM Views : 1454

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్ మండలం అచ్చెల్లి గ్రామానికి చెందిన ఆశా వర్కర్ నాయిని శకుంతల మృతి చెందడం విషాదకరమని సీఐటీయూ జిల్లా జాయింట్ సెక్రటరీ వెలిశాల క్రిష్ణమాచారి అన్నారు. చింతకుంట సబ్‌సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న శకుంతల అధిక పనిభారం,ఎండ తీవ్రత కారణంగా మృతి చెందినట్లు ఆరోపించారు.మృతురాలి భౌతికకాయానికి తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా అధిక పనిభారం మోపుతున్న ప్రభుత్వ విధానాలను విమర్శించారు.మృతురాలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పద్మ, నాయకులు సరస్వతి, కేసరా, కవిత, శాంత నిర్మల తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :