వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో భాగంగా తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.జిల్లా కేంద్రంలోని బాపునగర్, పైకాజి నగర్ పాటు పలు ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు సందడిగా సాగాయి. మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి . ఒకచోట చేరిన మహిళలు సంప్రదాయ పద్ధతుల్లో బతుకమ్మ సంబరాలు. తెలంగాణ ఆడపడుచుల సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే బతుకమ్మ వేడుకలతో జిల్లా కేంద్రంలోని ఆయా ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ సంప్రదాయాలను కొనసాగిస్తూ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరిగింది
Reporter
వాస్తవ గమ్యం