Monday, 26 October 2026 04:28:29 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

మట్టి వినాయకుడితో పర్యావరణ సందేశం.

రాక్ స్టార్ యూత్‌కు ఎస్సై ఉదయ్ కుమార్ అభినందనలు..

Date : 19 September 2026 01:29 PM Views : 284

వాస్తవ గమ్యం / తెలంగాణ / జగిత్యాల్ : పర్యావరణ పరిరక్షణకు వినాయక చవితి వేడుకలను అనుసంధానిస్తూ మండలంలోని గోడిశెలపేట గ్రామంలో రాక్ స్టార్ యూత్ వినూత్న సందేశాన్ని చాటింది. పర్యావరణహితమైన మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి నిత్యం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్న యువత, శనివారం ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ​ఈ కార్యక్రమానికి వెల్గటూర్ ఎస్సై పి. ఉదయ్ కుమార్, స్థానిక సర్పంచ్ కందికట్ల అమృత రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మట్టి వినాయకుడిని పరిశీలించిన వారు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రాక్ స్టార్ యూత్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ఎస్సై ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జన వేడుకల్లో యువత సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. డీజేలు, అధిక శబ్దాలతో ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా భక్తిశ్రద్ధలతో భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల మధ్య నిమజ్జనం పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.ఈ వేడుకల్లో రాక్ స్టార్ యూత్ సభ్యులు, గ్రామ యువతతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

ALISHETTI ASHOK

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: