వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: సింగరేణి కాళీ సునీత పాఠశాల ఉపాధ్యాయురాలు నూగురు అనుపమ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 123 మంది ఉత్తమ ఉపాధ్యాయుల్లో ఆమెకు చోటు లభించింది. విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత పెంపొందించడంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. సెప్టెంబర్ 5న కొడంగల్‌లో జరిగే ముఖ్యమంత్రి సభలో అవార్డు అందజేయనున్నారు. అనుపమ ఎంపికపై సింగరేణి ప్రాంత విద్యా వర్గాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
Reporter
వాస్తవ గమ్యం