వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పేపర్ మిల్ కార్మికుల సమావేశంలో యాజమాన్యం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని మజ్దూర్ యూనియన్ ఆరోపించింది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించాలని అధ్యక్షుడు జే.మల్లికార్జున్ డిమాండ్ చేశారు. లేబర్ కోడ్ల పేరుతో ఎన్నికలు వాయిదా వేయడం సరైంది కాదని పేర్కొన్నారు.వేతన ఒప్పందం సజావుగా సాగాలంటే గుర్తింపు యూనియన్ అవసరమని, కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చూపుతోందని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం