Tuesday, 27 October 2026 06:45:48 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

రాబోయే రోజుల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు కలెక్టర్ కె హరిత

Date : 10 October 2026 11:48 AM Views : 78

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాబోయే రోజుల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిర్వహించిన ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్.జిల్లాలో వర్షపాతం,వ్యవసాయం , తాగునీటి పరిస్థితులపై సమగ్ర నివేదికను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.జిల్లాలోని 13 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని, కేవలం రెండు మండలాల్లో మాత్రమే స్వల్ప వర్షపాతం లోటు ఉన్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి ఇబ్బందులు కలగ కుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ రాబోయే రోజుల్లో తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ రంగానికి ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.వలసల నివారణకు ఉపాధి హామీ పనులు.గ్రామీణ ప్రాంతాల్లో కూలీల వలసలను నివారిం చేందుకు స్థానికంగా ఉపాధి హామీ పనులను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా పశువులకు మేత కొరత ఏర్పడకుండా ముందస్తుగా పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులతో సమన్వ యం చేసుకుంటూ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత స్పష్టం చేశారు.

JAVADE RAJU

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: