వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి.బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు,తెలంగాణ ఉద్యమకారుడు,మందమర్రి పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు దివంగత జే.రవీందర్ (జేఆర్) కుటుంబాన్ని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పరామర్శించారు. వారి స్వగృహానికి చేరుకున్న దివాకర్ రావు, జేఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి జేఆర్ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు బలికొండ రమేష్, మేడిపల్లి సంపత్, బండారు సూరిబాబు, బత్తుల శ్రీనివాస్, ఎండీ అబ్బాస్, బోరిగం వెంకటేష్, పంజాల ఈశ్వర్, బట్టు రాజ్ కుమార్, దాసరి నవీన్, సీపెల్లి సాగర్, అందే శ్రీకాంత్, మంతనే సుమన్, బెల్లం అరుణ్, ఎండీ పాషా, ఎర్ర రజిత తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం