Sunday, 13 September 2026 07:54:28 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమర్రి పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్

Date : 24 June 2026 07:26 PM Views : 141

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 24: మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై వైద్య సిబ్బంది, ఆశా ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కల్పించారు. వైద్య, విద్య, మున్సిపల్, ఐసీడీఎస్ తదితర శాఖల సమన్వయంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బందికి ఇప్పటికే శిక్షణ అందించామని, పోలియో వ్యాక్సిన్‌ను అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో సుమారు 76,367 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 459 పల్స్ పోలియో కేంద్రాల ద్వారా సుమారు 1,836 మంది వైద్య సిబ్బందితో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు.ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని ఐదేళ్లలోపు పిల్లల వివరాలను సేకరించి, మొదటి రోజే 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. మిగిలిపోయిన పిల్లలకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు. అప్పుడే పుట్టిన పిల్లలు, గతంలో వ్యాక్సిన్ తీసుకున్నవారు, జ్వరం, జలుబుతో బాధపడుతున్న పిల్లలు కూడా పోలియో చుక్కలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు.అనంతరం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, అసంక్రమణ వ్యాధుల నిర్వహణ, ఔషధ నిల్వలను పరిశీలించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని, స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. గడువు ముగిసిన మందులను ప్రత్యేకంగా వేరు చేసి భద్రపరచాలని సూచించారు.అలాగే బీపీ, షుగర్ వంటి అసంక్రమణ వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి వారి వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని, సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మెరుగైన వైద్య సేవలు అందించడంలో ముందుండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీప్రసన్న, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ఆశా ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది, పర్యవేక్షకులు, క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో పాల్గొంటున్న సిబ్బంది పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :