వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరాం 20వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 9న సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని ముదిరాజ్ భవన్‌లో ‘బహుజన రాజ్యాధికార సమరభేరి సభ’ నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు జోన్-3 ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి మెదక్ జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, పేద అగ్రవర్ణ సామాజిక వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.కాన్షీరాం ఆశయాలను ముందుకు తీసు కెళ్లేందుకు,బహుజన వర్గాల హక్కులు, రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని వారు కోరారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి బోడపట్ల నర్సింగ్‌రావు విజ్ఞప్తి చేశారు.
Reporter
వాస్తవ గమ్యం