వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : భీమారం మండల కేంద్రంలోని బీసీ కాలనీలో కొలువుదీరిన శ్రీరామ యూత్ గణేశ్ మండలి వద్ద శుక్రవారం కుంకుమ పూజ అత్యంత ఘనంగా నిర్వహించారు.వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు పురస్కరించుకుని ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని మండపం నిర్వాహకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ నిర్వహించారు .మండలి నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయగా, పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Reporter
వాస్తవ గమ్యం