వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్‌పై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు హాజీపూర్ మండల అధ్యక్షులు గడ్డం స్వామి రెడ్డి, గర్మిళ్ల జోన్ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్‌కుమార్, నస్పూర్ జోన్ అధ్యక్షులు కుర్రె చక్రవర్తి తెలిపారు. మంగళవారం మంచిర్యాల బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రఘునాథ్‌పై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతీయ రహదారి-63 విషయంలో బైపాస్ నిర్మాణాన్ని మాత్రమే కోరారని, అలైన్‌మెంట్ మార్చాలని కోరలేదన్నారు. పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం