Sunday, 13 September 2026 07:36:16 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు పునరుజ్జీవం

Date : 08 May 2026 08:54 PM Views : 169

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టిలో ప్రతిపాదిత ప్రాణహిత ప్రాజెక్టు ప్రాంతాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామి శుక్రవారం పరిశీలించారు. అనంతరం ప్రాణహిత నదికి జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం పేరిట భారీగా ఖర్చు చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో చర్చలు జరిపి ప్రాజెక్టు నిర్మాణంపై ముందుకు వెళ్తామని చెప్పారు.మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, పాల్వాయి హరీష్ బాబు, కలెక్టర్ హరిత, ఎస్పీ నిఖిత పంత్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :