Saturday, 12 September 2026 04:51:29 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

అభివృద్ధి పనులపై ఎంపీ గోడం నగేష్ తనిఖీ..

నాసిరకం ఇసుక వాడకంపై ఆగ్రహం

Date : 09 July 2026 06:22 PM Views : 242

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ గురువారం జిల్లాలో పర్యటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.తిర్యాని మండలంలోని సుంగాపూర్ గ్రామంలో రూ.3.75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న శాటిలైట్ భవనం నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ గోడం నగేష్, పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.అనంతరం సుంగాపూర్‌లో రూ.3.25 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల భవనం నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణంలో నాసిరకం ఇసుక వాడుతున్నట్లు గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. వెంటనే నాసిరకం ఇసుకను తొలగించి నాణ్యమైన ఇసుకతోనే నిర్మాణ పనులు చేపట్టాలని సంబంధిత ఏఈ కి ఆదేశాలు జారీ చేశారు. ప్రజాధనం వృథా కాకుండా ప్రతి నిర్మాణం నాణ్యతతో పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కోటినాక విజయకుమార్, జిల్లా ఎన్నికల కన్వీనర్ నాగేశ్వరరావు, జిల్లా నాయకుడు కేసరి ఆంజనేయులు గౌడ్, బీజేపీ తిర్యాని మండల అధ్యక్షుడు సారా రమేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గాయంగి తిరుపతి, నాయకులు రంగు అరుణ్ కుమార్, శంకర్ గౌడ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :