వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి లో తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫస్ట్ జోన్ నెహ్రూ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో స్థానిక మహిళలు,యువతులు మరియు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.రంగురంగుల పూలతో తీరొక్క బతుకమ్మలను అందంగా పేర్చి, ఒకే రంగు చీరకట్టులతో (మ్యాచింగ్ డ్రెస్ కోడ్) మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ, సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందోత్సాహాల నడుమ వేడుకలు.జరుపుకున్నారు తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకల్లో యువకులు మరియు కాలనీ వాసులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి, వాయనాలు ఇచ్చిపుచ్చు కున్నారు.
Reporter
వాస్తవ గమ్యం