Monday, 14 September 2026 10:55:45 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 29 July 2026 07:54 PM Views : 271

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లాలో హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ, నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి చర్యలను మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.బుధవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించిన జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నరేంద్ర రాథోడ్, ఎయిడ్స్ కోఆర్డినేటర్ నీలిమతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవి/ఎయిడ్స్ నియంత్రణ చర్యలను మరింత విస్తరించి, స్క్రీనింగ్ సేవలను పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. బహుళ రంగాల కార్యాచరణ వ్యూహం లక్ష్యాలను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.చికిత్స పొందని హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించడంతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన బహిరంగ ప్రదేశాల్లో స్వీయ ప్రమాద అంచనా క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసి స్వచ్ఛంద హెచ్ఐవి పరీక్షలను ప్రోత్సహించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు, మున్సిపల్ కార్మికులు, అధిక ప్రమాదం ఉన్న కార్మిక వర్గాల కోసం ప్రత్యేక ఆరోగ్య, హెచ్ఐవి స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. హెచ్ఐవి బాధితులకు సామాజిక సంరక్షణ, మద్దతు, భద్రత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హులైన లబ్ధిదారులు సంబంధిత ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నరేంద్ర రాథోడ్ జిల్లాలో హెచ్ఐవి నియంత్రణ చర్యల పురోగతిని వివరించారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు సేవలు మరింత చేరువయ్యేలా చెన్నూర్‌లో నూతన ఐసీటీసీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సమావేశంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఐసీటీసీ కౌన్సిలర్లు, లింక్ ఆర్ట్ సెంటర్ సిబ్బంది, హెచ్ఐవి పాజిటివ్ నెట్‌వర్క్ ప్రతినిధులు పాల్గొన్నారు

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :