వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రెబ్బెన: విజయదశమి సందర్భంగా రెబ్బెన మండల కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల పక్కన ఉన్న మైదానంలో నిర్వ హించే రావణ దహన కార్యక్రమానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సై ఏ. వెంకటకృష్ణ తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుం టున్నట్లు పేర్కొన్నారు.ప్రజలు శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
Reporter
వాస్తవ గమ్యం