Monday, 26 October 2026 03:37:54 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

తెలంగాణ అడవుల్లో అరుదైన 'నీలి పుట్టగొడుగు'

చూడ్డానికి అందం..కానీ తింటే ప్రమాదం! ​

Date : 01 October 2026 11:24 AM Views : 95

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో అత్యంత అరుదైన నీలిరంగు పుట్టగొడుగులు వెలుగుచూశాయి. సిర్పూర్‌(టి) అటవీ డివిజన్‌ పరిధిలోని మాకిడి నెక్షన్‌, గొల్యాల్‌ అటవీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుండగా ఈ వింత శిలీంధ్రం కనిపించింది.న్యూజిలాండ్‌ అడవుల నుంచి తెలంగాణ దాకా.శాస్త్రీయంగా ఎంటోలోమా హోచెట్టరీ అని,వ్యవహారికంగా ‘బ్లూ పింక్ గిల్‌’ అని పిలిచే ఈ జాతి పుట్టగొడుగులు ప్రధానంగా న్యూజిలాండ్‌లోని వర్షారణ్యాల్లో కనిపిస్తుంటాయి. వీటిలో ఉండే ‘అజులిన్‌’ అనే వర్ణద్రవ్యం (పిగ్మెంట్‌) వల్లే ఇవి ముదురు నీలిరంగులో మిరుమిట్లు గొలుపుతూ కనిపిస్తాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో ఈ జాతి కనిపించడం రాష్ట్ర జీవ వైవిధ్య సంపదకు నిదర్శనమని అటవీ శాఖ అధికారి మోహన్‌రావు తెలిపారు. ​అందంగా ఉన్నాయని తినకండి.నీలిరంగులో చూడముచ్చటగా ఉన్నప్పటికీ, ఈ రకం పుట్టగొడుగులు విషపూరితమైనవా కాదా అనే దానిపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. కొన్ని రకాల అడవి శిలీంధ్రాల్లో ప్రాణాంతక విషపదార్థాలు ఉండే అవకాశం ఉన్నందున, స్థానికులు లేదా అటవీ సమీప గ్రామాల ప్రజలు వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ కోయడం కానీ, వండుకుని తినడం కానీ చేయకూడదని అటవీ శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :