వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఖైరిగూడ ఓసీపీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, డ్రైవర్లు ఎండాకాలం నేపథ్యంలో తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులకు అందిస్తున్న మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సమానంగా ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మైన్ ఫిట్ సెక్రటరీ మారం శ్రీనివాస్ నాయకత్వంలో గని పీఓ నరేందర్, మేనేజర్ శంకర్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికుల బ్రాంచ్ కార్యదర్శి చల్లూరి అశోక్, సహాయ కార్యదర్శి సాగర్ గౌడ్, తిరుపతి, సదానందం, వేణుగోపాల్, శంకర్, సుగుణాకర్, రాగులయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం