వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి మండలంలోని కాసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మోకేనపల్లి లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదివారం వారి నివాసానికి చేరుకుని లక్ష్మయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ కష్ట సమయంలో పార్టీ అండగా ఉంటుందని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన భరోసా ఇచ్చారు. లక్ష్మయ్య మృతి పట్ల ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు: నాతరి స్వామి: రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ కర్కూరి రామచందర్: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బరిగల రఘు,ఎంబడి సురేష్ మరియు ఇతర కాంగ్రెస్ శ్రేణులు.
Admin
వాస్తవ గమ్యం