వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : బతుకమ్మ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిన శ్రీవాణి కోమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాద కర ఘటన చోటుచేసుకుంది.బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న ఓ యువతి అకస్మాత్తుగా స్పృహతప్పి కిందప డటంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా విషాదా న్ని నింపింది.ఆసిఫాబాద్ మండలం బూరుగుడ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుండగా,చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామానికి చెందిన శ్రీవాణి (25) బతు కమ్మ ఆడుతూ ఒక్కసారిగా స్పృహతప్పి కిందపడిపోయింది. దీంతో అక్కడున్నవారు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి.తరలించారు. అయితే, అప్పటికే శ్రీవాణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు స్థానికులు తెలిపారు. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీవాణి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పండుగ సంబరాల మధ్య చోటుచేసుకున్న ఈ ఘటనతో బూరుగుడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.యువతి మృతికి గల కారణాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
Reporter
వాస్తవ గమ్యం