వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శిథిలావస్థకు చేరిన డయాలసిస్ కేంద్రం స్థానంలో నూతనంగా నిర్మించబోయే జీజీహెచ్ ఆసుపత్రిలో ప్రత్యేక డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్తలు, డయాలసిస్ రోగుల తరఫున ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు విజ్ఞాపన పత్రం అందజేశారు. ప్రస్తుతం తాత్కాలికంగా కేటాయించిన షెడ్డులో పూర్తిస్థాయి వసతులు లేవని, రక్త పరీక్షలు, వైద్యుల పర్యవేక్షణ, విద్యుత్ బ్యాకప్, అత్యవసర సేవలు అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. నూతన జీజీహెచ్‌లో డయాలసిస్ యూనిట్ బ్లాక్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వంజరి వెంకటేష్, రావుల లక్ష్మీబాబు, అడిగోప్పల మురళి, బండి హరీష్, నాగవత్ శేఖర్ నాయక్, రావుల రామచందర్, రావుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం