వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : ఓటర్ల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ( రెవెన్యూ) రాములు పేర్కొన్నారు. బుధవారం భీమారం పంచాయితీ కార్యాలయంలో సర్ ప్రక్రియను పరిశీలించారు. ఎన్యుమరేషన్ డిజిటలైజేషన్ పనులను వేగవంతం చేయాలని, బీఎల్ఎలు పొరపాట్లకు తావులేకుండా ఓటరు వివరాలను నమోదు చేయాలని సూచించారు. సదస్సులో సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి పున్నం చంద్, తహశీల్దార్ సదానందం, ఎంపీడీవో వీణ, ఎంపీవో సతీశ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం