వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం జిల్లా వాంకిడి మండలంఅర్హులైన వారికే ప్రభుత్వ చేయూత పింఛన్లు అందేలా దరఖాస్తులను పకడ్బందీగా పరిశీ లించి,క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని డీఆర్డీఏ అధికారి దత్తారావు సూచించారు.ఈ మేరకు వాంకిడి మండలంలో కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారులకు కంటి చూపు ఉన్నప్ప టికీ,అంధత్వం ఉన్నట్లు పేర్కొంటూ సదరం ధ్రువపత్రాలు పొందినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు అధికారి తెలిపారు.ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు సంబంధిత వైద్య, సెర్ఫ్, మండల స్థాయి సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడిం చారు.ప్రభుత్వ పింఛన్లు నిజమైన అర్హులకే అందేలా పారద ర్శకంగా విచారణ చేపట్టాలని, దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Reporter
వాస్తవ గమ్యం