వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ (జీఎం)ని కల్యాణిఖని నూతన ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఏరియాలో నెలకొన్న పలు సమస్యలతో పాటు సింగరేణి ప్రాజెక్టులు,కార్మికుల సంక్షేమంపై సుదీర్ఘంగా చర్చించారు.మందమర్రి పట్టణ భవిష్యత్తుకు భరోసానిస్తూ పలు అంశాలపై జీఎంతో జరిపిన చర్చల వివరాలు.స్థానికంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్కే-1 ఫేజ్-2 బొగ్గు గనికి సంబంధించిన ఫారెస్ట్ క్లియరెన్స్ ప్రక్రియ తుది దశకు చేరుకుందని, అతి త్వరలోనే సానుకూల ఫలితం (శుభవార్త) రానుందని జీఎం పేర్కొన్నారు. అనుమతులు రాగానే పనులను వేగవంతం చేసి ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.రానున్న కాలంలో మందమర్రి ఏరియా మరింత అభివృద్ధి చెందేలా కొత్త ప్రాజెక్టుల విస్తరణకు సింగరేణి సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు.పట్టణంలోని తాగునీరు, డ్రైనేజీ, స్థానిక మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి సైతం ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.ప్రజా సమస్యలను యాజమాన్యం దృష్టికి తేవడంలో, సంస్థ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర కీలకమని ఈ సందర్భంగా జీఎం కొనియాడారు.ఈ కార్యక్రమంలో కల్యాణిఖని నూతన ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం