వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : దేశ రాజధాని లో 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుకుతో చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వం దీక్షను విరమింపజేయాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం రోజున అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శనలో వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యం కారణంగానే నీట్ పేపరు లీకయి 21 మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కాబట్టి, బాధ్యతలను సక్రమంగా నిర్వహించని కేంద్ర మంత్రిని పదవి నుండి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. 19 రోజులుగా సోనం వాంగ్చుక్ నిరాహారదీక్ష చేస్తున్నా.కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్య ధోరణి వహించడం సరైనది కాదని వారు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఉద్యమకారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని వారు కోరారు. గతంలో లోక్ పాల్ బిల్లు కోసం అన్నా హజారే నిరసన దీక్ష చేపట్టినప్పుడు.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దిగివచ్చి ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చిందని వారు గుర్తు చేశారు. నేటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు మొండి వైఖరిని అవలంబించడాన్ని దేశ ప్రజలు నిరసిస్తున్నారని వారు తెలిపారు. దేశానికి విలువైన సేవలు అందించిన శాస్త్రవేత్తగా పర్యావరణవేత్తగా సోనం వాంగ్చుకు దేశ ప్రజలందరికీ ఆప్త బంధువుగా నిలిచాడని వారు పేర్కొన్నారు. సోనం వాంగ్చుకు ప్రాణాలు వెలకట్టలేనివని, తక్షణం ప్రభుత్వ పెద్దలు చర్చలకు సిద్ధం కావాలని వారు కోరారు.ప్రభుత్వ విధానాలపై నిరసన తెలుపుతున్న వారిని దేశద్రోహులని, విదేశీ ఏజెంట్లని నిందించడం మానుకోవాలని హితవు పలికారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు.యువతకు ఉపాధి కల్పించే దిశలో పాలకులు శ్రద్ధ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో *సంకె రవి జిల్లా కన్వీనర్.* పౌర స్పందన వేదిక కన్వీనర్ క్యాతం రవికుమార్,సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం,బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య, బీసీ మేధావుల ఫోరం జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ శ్రీరామోజు కొండయ్య, తెలంగాణ జన సమితి నాయకులు ప్రదీప్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాయకులు జైపాల్ సింగ్,సామాజిక ఉద్యమకారులు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్, మోతె రామదాసు, శ్రీమన్నారాయణ, బొజ్జ శరత్,గోగుల రవీందర్ రెడ్డి,రాధేశ్యాం, వేముల కిరణ్, షబ్బీర్ పాషా, కైలాసం,పడాల శ్రీనివాస్, మధు,జాగిరి రాజేష్, పూరెల్ల నితీష్,అంకం సాగర్,మెరుగు సతీష్, సమ్మయ్య,మహ్మద్ ఇబ్రహీం,కట్ట ప్రకాష్, మిడివెల్లి రాజ్ కుమార్, అడ్వాల లింగమూర్తి, రాజగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం