వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : భీమిని మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీ.శే. పంతంగి ప్రమోద్ గౌడ్ చిత్రపటానికి టీపీసీసీ (టీపీసీసీ) రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.నెల్లాళ్ల క్రితం బైక్ ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ, అనారోగ్యంతో ఈ నెల 12వ తేదీన ప్రమోద్ గౌడ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం భీమిని మండలం వడాల్ గ్రామంలోని ఆయన నివాసంలో పెద్దకర్మ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాతరి స్వామి, ప్రమోద్ గౌడ్ చిత్రపటం వద్ద నివాళులర్పించి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండలంలో ఒక బలమైన నాయకుడిని కోల్పోయిందని, వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భీమిని మాజీ మండల వైస్ చైర్మన్ గడ్డం మహేందర్ గౌడ్, సీనియర్ నాయకులు బ్రహ్మయ్య, బండి లక్ష్మణ్‌లతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు.
Admin
వాస్తవ గమ్యం