Monday, 26 October 2026 03:38:06 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

కర్ణమామిడి పీఏసీఎస్‌ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకారం

Date : 26 September 2026 08:28 PM Views : 90

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌లో కర్ణమామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ( పి ఎ సి ఎస్) నూతన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. వారిని శాలువాలతో సన్మానించారు.రైతుల సంక్షేమం, సహకార రంగం బలోపేతం, గ్రామీణాభివృద్ధిలో పీఏసీఎస్‌లు కీలకంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలను గుర్తించి సహకార స్ఫూర్తితో సేవలందించాలని కోరారు. కమ్యూనిటీ హాల్ మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు భూమయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, హాజీపూర్ మండల అధ్యక్షుడు తోట రవి, వైస్ చైర్మన్ జాలే రాయలింగు, జిల్లా ఆర్ జి పి ఆర్ ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, జిల్లా ఓ బి సి చైర్మన్ వొడ్డే రాజమౌళి, ప్రజాప్రతినిధులు,పీఏసీఎస్‌ డైరెక్టర్లు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :